Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

నిర్మల్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలి

Every one  cooperate to make Nirmal   beautiful

మన తెలంగాణ/నిర్మల్: నిర్మల్ పట్టణాన్ని అందమైన పట్టణంగా అభివృ ద్ధిపరిచేందకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతీ ఒకరు సహ కరించాలని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరన్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నాడు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పట్టణంలోని వార్డులలో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనుల ప్రతిపాదన వార్డులవారీగా కౌన్సిల్ స మావేశంలో ప్రవేశపెట్టారు. వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్‌ల నిర్మాణ పనులు ఇతర పనులు చేపట్టేందుకు కావాల్సి నిధులు, తదితర అంశాలపై నివేదిక రూపొందించి మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్ర వర్తి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధిపరిచి సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలి పారు. రోడ్డు మధ్యలో డివైడర్ల ఏర్పాట్లు, సెంటర్ లైటింగ్, గ్రీనరీ ఏర్పా టుచేసి అందమైన పట్టణంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు. వాకింగ్ ట్రాక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌చక్రవర్తి, వైస్ చైర్మన్ అజింబిన్ యాహ్య, ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, కమీషనర్ రవిబాబు, మాజి చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments