Search
Tuesday 19 June 2018
  • :
  • :

అప్పుల బాధతో రైతు అత్మహత్య

Farmer Sucide with dept Money In Vikarabad

బంట్వారం: అప్పుల బాధతో మనస్థాపం చెంది ఓ రైతు అత్మహత్య చెసుకున్న సంఘటన బంట్వారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిసపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని సల్బాత్తాపూర్ గ్రామానికి చెందిన సతంగారి లాలయ్య (40) వ్యవసాయం చెేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు అతని పేరు పైన 91 సర్వె నంబరు 1.20 ఎకరం ఇరువై గుంటల భూమి కలదు. అట్టి భూమిలో పంట పెట్టుబడి నిమిత్తం లాగోడి కోసం బంట్వారం ఆంధ్రబ్యాంక్ నుండి రూ.45 వేల రూపాయలు అప్పు తీసుకున్నారు. అలాగే తల్లి పేరు పైన ఉన్న 6.10 కుంటలు భూమి కూడా తనే సాగు చేస్తున్నాడు. అట్టి భూమిలో వ్యవసాయానికి పెట్టుబడి కోసం స్టేట్‌బ్యాంక్‌లో రూ. 90 వేల రూపాయలు అప్పు తీసుకున్నారు. పంటలు సరిగా పండక పోవడం దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేక దానికి తోడు స్వంత భూమిలో బావి తవ్వించాడు. దానికి 3 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు మృతిని భార్య మణెమ్మ వివరించారు. దిగుబడి రాక బావిలో నీరు లేక వ్యవసాయంలో దిగుబడి రానందున అప్పులు ఎలా తీర్చలని మనోవేధనకు గురై సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు భార్య మణెమ్మ భర్త కోసం మంగళవారం ఉదయం ఇరుగు పోరుగు వారిని అడుగగా గ్రామస్తులు ఊరి చివరగా సుదర్శన్ రెడ్డి పోలంలో తుమ్మ చెట్టుకు తన లుంగితో ఉరి వేసుకొని మృతి చెందాడని గ్రామస్తులు మృతిని భార్యకు తెలుపడంతో అక్కడి వెళ్లి చూసే సరికి మృతి చెందాడు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చెరుకున్న పోలీసులు శవ పంచానామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తాండూర్‌కు పంపించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం  శవాన్ని కుంటుబ సభ్యులకు అప్పగించి,  మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేకర్‌గౌడు తెలిపారు.

Comments

comments