Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

చరిత్రాత్మకమైనది

Farmers' insurance schemes are historic

దేశ చరిత్రలోనే రైతు బంధు.. రైతు బీమ పథకాలు చరిత్రాత్మకమైనది 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి 

మన తెలంగాణ/బాలానగర్: దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబందు, రైతు భీమా పథకాలు ఎంతో చారిత్రాత్మకమైనవని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి వివరించారు. బుధవారం మండల పరిధిలోని హేమాజీపూర్ గ్రామంలో రైతులకో ముఖాముఖీ నిర్వహించిన అనంతరం పట్టాదారు పాసు పుస్తకాలు, రైతుబందు చెక్కులు పంపిణీ చేశారు. అదే విధంగా పాస్ పుస్తకంలో తప్పులు దొర్లడాన్ని గమనించిన మంత్రి వెంటనే వారికి అధికారులతో ప్రోసిడింగ్ అందించారని అన్నారు. పాస్ పుస్తకా ల్లో తప్పులు దొర్లినట్లయి తే వాటిని సరిచేసి రైతులకు అందించాలని, రై తులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. పారద ర్శ కంగా రికార్డులుండాలని, అవకతవకలకు తావివ్వకూడదని పలువురిని మంత్రి మం దలించడం గమనార్హం. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జూన్ 2 నుండి రైతులకు భీమా పథకాన్ని ప్రారంభించేందుకు కార్యచర్ణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రతి రైతుకి భిమా వర్తింపు చేయనున్నట్లు తెలిపారు. ప్రమాద వశాత్తు రైతు మరణిస్తే పది రోజుల్లో రైతు నామినిగా గుర్తించిన వారికి డబ్బు అందుతుందన్నారు. అధికారులు నామినీల పేర్లు సరిగ్గా రాయాలన్నారు.

Comments

comments