Search
Monday 21 May 2018
  • :
  • :

జూన్ 8-9 తేదీల్లో చేపమందు పంపిణీ

Fish Medicine Distributed on June 8th and 9th

హైదరాబాద్ : మృగశిర కార్తెను పురస్కరించుకుని జూన్ 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ చేస్తామని బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే చేపమందు పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు. చేపమందు తీసుకున్న తరువాత నలబై రోజుల పాటు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఉబ్బసం, శ్వాస సంబంధిత రోగాలు నమయమవుతాయని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి చేపమందు కోసం వస్తారని ఆయన చెప్పారు. చేపమందు పంపిణీ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందిస్తున్న పన్నిలాల్ పిట్టి ట్రస్ట్, అగర్వాల్ సేవా దళ్, గౌడ వసతి గృహం వలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉబ్బసం, శ్వాస సంబంధిత రోగాలతో బాధపడుతున్న వారు తాము పంపిణీ చేసే చేపమందును తీసుకోవాలని ఆయన కోరారు.

Fish Medicine Distributed on June 8th and 9th

Comments

comments