Search
Monday 21 May 2018
  • :
  • :

యుపిలో కూలిన ఫ్లై ఓవర్

ind

16 మంది దుర్మరణం
శిథిలాల కింద మరి పెక్కు మంది
ప్రధాని మోడీ, యుపి సిఎం దిగ్భ్రాంతి

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం సాయంత్రం వారణాసిలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపం లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలడంతో 16 మంది మృతి చెం దారు. డజన్ల మందికిపైగా శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఐదు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు సీనియర్ అధికారి తెలిపారు. నిర్మాణంలో లాహర్త , ఛౌక ఘట్ ఫ్లై ఓవర్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న వారు, పార్క్ చేసిన, అటుగా వెళ్తున్న వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫ్లై ఓవర్ పనులు చేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఎనిమిది క్రేన్లు, గ్యాస్ కట్టర్లను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగం, ప్రజా పనుల శాఖను ఆయన ఆదేశించారని ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థనాథ్‌సింగ్ మీడియాకు తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి కెపి మౌర్య, మంత్రి నీలకాంత్ తివారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంలో మరణాలు సంభవించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎస్‌పి నేత అఖిలేష్‌యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Comments

comments