Search
Monday 21 May 2018
  • :
  • :

పూర్తి మెజార్టీ కాంగ్రెస్, జెడిఎస్‌కే ఉంది….

JDS

బెంగళూరు: కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.  జెడిఎస్ శాసనసభ పక్ష సమావేశంలో  శాసనసభపక్ష నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. కుమారస్వామిని జెడిఎస్ శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నామని రేవణ్ణ తెలిపారు. కుమారస్వామితో కలిసి రేవణ్ణ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఇద్దరు జెడిఎస్ ఎంఎల్‌ఎలు గైర్హాజరయ్యారు. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. లౌకిక ఓటు చీలడం వల్లే 104 స్థానాల్లో బిజెపి గెలిచిందని కుమారస్వామి పేర్కొన్నారు. బిజెపికి కన్నడ ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని, అందుకే తాము కాంగ్రెస్‌తో కలిసి ముందుకొచ్చామని వివరించారు. అధికారాన్ని దుర్వినియేగం చేసేందుకు బిజెపి కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అధికారం కోసం తాను సిఎం పదవి తీసుకోవడం లేదని, అటువంటి భావన ఉంటే బయటకు రావాలన్నారు. మతతత్వ బిజెపిని నిరోధించేందుకు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. సరైన సంఖ్యబలం లేకపోయినా అధికార బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చేసేందుకు బిజెపి యత్నిస్తోందని ధ్వజమెత్తారు. పూర్తి మెజార్టీ కాంగ్రెస్, జెడిఎస్‌కు మాత్రమే ఉందని, ఇదే విషయాన్ని గవర్నర్ వాజూభాయ్‌కు తెలియజేశానన్నారు. గతంలో ఏకైక పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్న గవర్నర్ నిరాకరించిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇప్పుడు అదే విధానాన్ని కర్నాటకలో అనుసరించాలని కోరుతున్నామన్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు తొమ్మిది స్థానాలు బిజెపికి తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆపేరషన్ కమలం పేరిట రాజకీయ వ్యభిచారానికి బిజెపి పాల్పడిందని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి ఏదో విధంగా గట్టెక్కాలని బిజెపి నేతలు అనుకుంటున్నారని దుయ్యబట్టారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీయే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కుమారస్వామి ఆరోపణలు చేశారు. అధికార ప్రలోభాలు, ఐటి దాడులు, ఇదే బిజెపి తీరని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన దాఖలాలు లేవని, ఒక్కో ఎంఎల్‌ఎకు రూ.100 కోట్లను బిజెపి ఆఫర్ చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. గవర్నర్ తీరునూ కుమారస్వామి తప్పుబట్టారు.

Comments

comments