Search
Monday 21 May 2018
  • :
  • :

భారీగా పతనమైన పసిడి, వెండి ధరలు

Gold and Silver Prices Decreased Today

ముంబయి: గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన పసిడి ధర బుధవారం ఒక్కసారిగా పడిపోయింది. కేవలం ఒక్కరోజే రూ. 430 తగ్గిపోయింది. దీంతో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 32,020 పలికింది. దీనికి కారణం అంతర్జాతీయంగా గిరాకీ లేకపోవడంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడమే ధర దిగిరావడానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు వెండి కూడా పడిసి బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. 250 తగ్గి రూ. 40,650కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడంతోనే వెండి ధర తగ్గిందని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.

Comments

comments