Search
Monday 21 May 2018
  • :
  • :

దిగొస్తున్న బంగారం ధర

Gold prices will continue to climb due

ముంబై: అంతర్జాతీయ, దేశీయ అంశాల ప్రభావంతో బంగారం ధర దిగివస్తోంది. బుధవారం ఒక్కరోజే రూ.430 తగ్గిన బంగారం ధర గురువారం కూడా మరింతగ తగ్గింది. డిమాండ్ లేకపోవడంతో పసిడి ధర రూ.32వేల మార్క్ దిగువకు చేరింది. గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.240 తగ్గి రూ.31,780కి చేరింది. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బంగారం ధరపై పడుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.  ఇక అంతర్జాతీయంగా పసిడి ధర 0.16శాతం తగ్గడంతో ఔన్సు ధర 1,288.10 డాలర్లుగా ఉంది.  మరోవైపు బంగారానికి విరుద్ధంగా వెండి ధర స్వల్పంగా పుంజుకుంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.40,750కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి స్పల్పంగా డిమాండ్ రావడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Comments

comments