Search
Tuesday 19 June 2018
  • :
  • :

టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలు

Good services Developments in Anganwadi centers

మన తెలంగాణ/ వికారాబాద్ రూరల్ ః టోల్ ఫ్రీ నంబర్ 155209 ద్వారా అంగన్ వాడీలో మెరుగైన సేవలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. మంగళవారం కలెక్టరటులోని తన చాంబర్‌లో అంగన్ వాడి హెల్ప్ లైన్ గోడ పత్రికను వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ అంగన్ వాడిల్లో మెరగైన సేవలు పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా హెల్ప్ లైన్‌ను రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. టోల్ ఫ్రీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంగన్ వాడీల్లో సేవలను పొందవచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల పిల్లల్లోపు వారికి పొందవచ్చునని ఆయన చెప్పారు. టోల్ ఫ్రీ ద్వారా అంగన్ వాడి సేవల అమలు గురించి లబ్దిదారులు సమాచారం అందించడమే కాకుండా సమాచారాన్ని పొందవచ్చునని ఆయన వెల్లడించారు. ఆరోగ్యలక్ష్మి, అంగన్‌వాడి సేవలతో పాటు సలహాలు దీని ద్వారా పొందవచ్చన్నారు. అంగన్‌వాడి టీచర్లు కార్యక్రమాల అమలులో సహకారాన్ని కూడా టోల్ ఫ్రీ ద్వారా పొందవచ్చునని తెలిపారు. గోడ పత్రిక ఆవిష్కరణలో జిల్లా ఎస్పీ అన్నపూర్ణ, జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, అడిషనల్ ఎస్పీ నర్సిములు, డిడబ్లుఓ జ్యోత్స, డిఈఓ రేణుకాదేవి, ఉద్యానవన శాఖాధికారి సంజయ్‌కుమార్, డిసిఎస్‌ఓ పద్మజ, తాండూర్ ఆర్డీఓ వేణుమాధవ్  పాల్గొన్నారు.

Comments

comments