Search
Monday 21 May 2018
  • :
  • :

ఉచిత కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao launched the free constable training program

సిద్దిపేట అర్బన్‌ః పట్టుదలతో ప్రయత్నిస్తే ఎదైనసాధ్యమేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సెంటర్‌ను స్థానిక టిటిసి భవన్ లో ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ ఆత్మవిశ్వసానికి ప్రతిక మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని, ఆయన ఆత్మ విశ్వాసంతో మనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చాడని, అలాగే పట్టుదలతో సాధన చేస్తే ఎలాంటి క్లిష్ట పని అయిన సుసాధ్యం చేసుకోవచ్చని ఆయన  అన్నారు. ఈ శిక్షణ శిబిరంలో విద్యార్ధులకు 70 రోజు ల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఇలాంటి శిక్షణ బయట కోచింగ్ సెంటర్లలో తీసుకుంటే 40 వేల ఖర్చు అవుతుందని, కానీ ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్ధులకు సూచించారు.జిల్లాలోని ముంపు గ్రామాల విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి పెట్టామని వారికి రెసిడెన్షియల్ తో కూడిన శిక్షణను అందిస్తామని తెలిపారు.రాత పరీక్ష,దేహదారుడ్య,అలాగే ఫైనల్ పరీక్ష వరకు కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు.పోలీస్ డిపార్టుమెంట్‌కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. అనంతరం సిపి జోయల్ డెవిస్ మాట్లాడుతూ మంత్రి హరీష్‌రావు కృషితో కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించడం సాధ్యం అయ్యిందని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి వారం అబ్యర్ధులకు టాలెంట్ పరీక్షలు నిర్వహించి వారి ప్రతిభ సామర్ధ్యాలను పరిశీలిస్తామని అన్నారు. సిద్దిపేట నుండి కనీసం వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చెలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రంలో పోలీస్ ఉన్నతాధికారులు ,నాయకులు పాల్గొన్నారు.

Comments

comments