Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ప్రజలకు సేవ చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు: మంత్రి హరీష్‌రావు

Harish Rao Speech About Siddipet Mondal Devlopment
సిద్దిపేట అర్బన్‌: ప్రజలకు సేవ చేస్తే మనల్ని వారు గుండెల్లో పెట్టుకుంటారని మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట ఎంపిడిఒ కార్యలయంలో మండల సర్వసభ్య సమవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరం కలిసి టీం వర్క్ చేద్దామని మంత్రి హరీష్‌రావు అన్నారు.జాతీయ స్ధాయిలో అవార్డులు గెలుచుకున్న సిద్దిపేట మండలంగా మనం గర్వపడాలని అన్నారు. 2014….2015 సంవత్సరంలోనే ఉత్తమ జాతీయ స్ధాయి మండలంగా అవార్డు తీసుకున్నామని తెలిపారు. 2014…2015 లోనె ఇబ్రాహింపూర్.లింగారెడ్డి పల్లి గ్రామాలు జాతీయ స్ధాయిలో ఉత్తమ గ్రామాలుగా నిలిచాయని అలాగే 2015…2016 లో రాష్ట్ర ప్రభుత్వం చే ఉత్తమ గ్రామం అవార్డును ఇబ్రాహింపూర్ గెలుచుకుందని అన్నారు. మరోసారి జాతీయ స్ధాయిలో ఉత్తమ గ్రామంగా ఇబ్రాహింపూర్ గ్రామం అవార్డు పొందిందని అన్నారు. 2016..2017 లో ఇర్కోడ్ గ్రామం ఉత్తమ గ్రామంగా అవార్డు పొందిందని అన్నారు. మండలంలో గ్రామాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి అవార్డులు గెలిచి సిద్దిపేట మండలాలని గౌరవం తెచ్చి పెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. మనమంతా ఒక కుటుంబలా పని జరగాలన్న తపనతో కలిసి కట్టుగా కృషి చేశాం కాబట్టి అవార్డులు దక్కాయని అన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా కలిసి కట్టుగా అవార్డులు అందుకోవాలని సూచించారు.

సిద్దిపేట మండల అభివృద్దిని 5వేల మంది సర్పంచ్‌లు ఇతర ప్రాంతాలనుండి వచ్చి చూసి వెళ్లారని పలు గ్రామాలైన మిట్టపల్లి,లింగారెడ్డి పల్లి,ఎల్లుపల్లి,ఇబ్రాహింపూర్ గ్రామాలతో మన సిద్దిపేట కు గొప్ప గౌరవం లభించిందని మంత్రి వివరించారు. అలాగే మండలంలోని చాలా గ్రామాలలో పశువుల పాకలు 1,2 వరకే నిర్మాణం జరిగాయని మరిన్ని నిర్మాణాలు చేపట్టడంలో అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల పాకల నిర్మాణాలతో పాటు గ్రామాలలో స్మశాన వాటికలో డంపింగ్ యార్డుల నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.కలెక్టర్ ఫైల్ పెట్టి బదిలిచేసేలా చర్యలు చేపట్టాలని ఎంపిడిఒ సమ్మిరెడ్డికి మంత్రి ఆదేశాలు ఇచ్చారు.పుల్లురు గ్రామంలోని మార్కెట్ గోదాం ను ఎందుకు వినియెగంలోకి తెవడం లేదని లక్షలు వెచ్చించి నిర్మించాం అంటు ఆగ్రామ ప్రజా ప్రతినిధులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు పాల్గొన్నారు.

Comments

comments