Search
Monday 21 May 2018
  • :
  • :

హైదరాబాదులో కుండపోత వర్షం…

rain-hyd
హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల వడగళ్లవాన పడింది. పట్టపగలే దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో నగరం మొత్తం పగటిపుటే రాత్రిని తలపించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, యూసుఫ్ గూడ, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్ పల్లి, మల్కాజిగిరి, కోఠి అమీర్ పేట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుండపోత వర్షంతో పాటు, ఈదురు గాలులు కూడా వీయడంతో పలు చోట్ల హోర్డింగ్ లు, చేట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

Comments

comments