Search
Monday 21 May 2018
  • :
  • :

శ్రీలంకలో కుండపోత వర్షాలు… వరదలు

int2

కొలంబో: శ్రీలంకలో కురిసిన కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 8  వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని అధికారులు సోమవారం చెప్పారు. ఆదివారం భారీ వర్షాల కారణంగా చాలామందిని వారి ఇళ్లనుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారని , అయితే ఈ రోజు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పరిస్థితి మామూలు ప్థితికి చేరుకుంటోందని విపత్తుల నిర్వహణ కేంద్రం ప్రతినిధి ప్రదీప్ కోడిప్పిల్లి చెప్పారు. ఆదివారం కురిసిన కుండపోత వర్షాల కారణంగా తలెత్తన వరద పరిస్థితితో గాలె, ఆలుతర జిల్లాల్లో దాదాపు 8,377 మంది నిరాశ్రయులైనారని  ఆ కేంద్రం తెలిపింది. ఒక్క గాలె జిల్లాలోనే దాదాపు 7742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని తెలిపారు. అయితే ప్రస్తుతం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ప్రదీప్ చెప్పారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని, అయితే అప్రమత్తగా ఉండాలని లోతట్టు ప్రాంతాలు ప్రజలను కోరినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం కూడా దేశంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది.

Comments

comments