Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

దేశానికే ఆదర్శం తెలంగాణ

 The country's mission is TRS government,

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: దేశానికే ఆదర్శం టిఆర్‌ఎస్ ప్రభుత్వమని, ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో పలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రశంసలు అందుకుంటున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, పర్యాటక అభివృద్ధ్ది శాఖా మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో సుమారు. రూ.23కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 8380 మంది ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టా ఉన్న రైతులకు గాను 8339 మందికి రూ.10కోట్ల 67లక్షల  21వేల 196 రూపాయల చెక్కులు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. మిగిలిన 41ఎఫ్‌ఒఆర్ పట్టాలు ఉన్న రైతులకు త్వరలో వ్యవసాయ పెట్టుబడి అందిస్తామన్నారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో 3376 మందికి ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాల రైతులకు రూ.5కోట్ల 48లక్షలు అందచేయనున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం ప్రపంచంలోనే ఎవ్వరూ ఊహించని విధంగా చేపట్టిన కార్యక్రమమని, రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తోందని అన్నారు.  ఐటిడిఏ ద్వారా రూ.7.75కోట్ల వ్యయంతో రోడ్లు భవన నిర్మాణం జరుగుతున్నాయని, భూ రికార్డులను రికార్డు స్థాయిలో కేవలం 100రోజుల్లో ప్రక్షాళన చేసి దానికి అనుగుణంగా రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు అందిస్తున్నామని మంత్రి అన్నారు. భూ రికార్డులో సవరణలు ఏమైనా ఉంటే జూన్ 20లోగా సవరించాలని మంత్రి రెవెన్యూ అధికారులకు ఆదేశించారు.  ప్రజలకు కావల్సిన కూడు, గుడ్డ, నీడ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మిషన్ భగీరధ ద్వారా త్వరలో అన్ని ఆవాసాలకు గోదావరి, పాలేరు నుండి శుద్దిచేసిన మంచినీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. కెజి టు పిజి ఉచిత విద్యలో భాగంగా 52 ఇంగ్లీష్ మీ డియం పాఠశాలలు ఎస్‌సి కుటుంబాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 22 డిగ్రీ కాలేజిలే మంజూరు చేసి అన్ని సదుపాయాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. గిరిజనులకోసం త్వరలో అశోక్‌నగర్‌లో సై నిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.45వేల కోట్ల వ్యయంతో 29 సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది చేస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రమన్నారు.
భూమి ఉన్న ప్రతి రైతుకు సాయం: ఎంపి సీతారాంనాయక్
కుల,మతాలకు అతీతంగా రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతీ రైతుకూ పంట పెట్టుబడి సాయం క్రింద ప్రతి ఎకరాకు రెండు పంటలకు రూ.8వేలు చొప్పున రాష్ట్రలో 38లక్షల రైతులకు రూ.12వేల కోట్లు సాయం అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని మహబూబాబాద్ ఎంపి అజ్మిర సీతారాంనాయక్ అన్నారు. పోడు భూముల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న రైతులందరికీ వ్యవసాయా పెట్టుబడి అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు 24గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌తోపాటు సాగునీరు అందించేందుకు సీతారం, కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. మండలంలోని ప్రతి గ్రామానికి ఎల్‌ఇడి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కట్కూరి దామోదర్‌రెడ్డి, ఐటిడిఏ పిఒ చక్రధర్‌రావు, డిటిడబ్లుఓ నారాయణస్వామి, మండల ప్రత్యేక అధికారి ఆంజనేయులు, డిఎస్‌పి నరేష్‌కుమార్, ఎంపిడిఓ జయరాం, తహీసీల్దారు ఉప్పలయ్య, జెడ్‌పిటిసి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
రూ.23కోట్ల అభివృద్ధిపనులు
రూ.23కోట్ల వ్యయంతో మంత్రి పలు అభివద్ధిపనులు ప్రారంబోత్సవం, శంకుస్థాపనలు చేశారు. రూ.257లక్షల వ్యయంతో నిర్మించే కొత్తగూడ మండలం కొత్తపల్లి వాయతండా నుండి బోటిమీది తండా వరకూ నిర్మించే రోడ్డు పనులకు మంత్రి, ఎంపి శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 358లక్షల వ్యయంతో చెరువు తండా నుండి దొరవారి వెంపల్లి వరకూ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని వెలుబల్లిలో రూ.16లక్షల 85వేల వ్యయంతో గ్రామ పంచాయితీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మండలంలోని బత్తులపల్లిలో రూ.16.85లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని రూ.9లక్షలతో నిర్మించనున్న పిహెచ్‌సి సబ్‌సెంటర్‌ను మంత్రి, ఎంపి ప్రారంభించారు. రైతుబంధు పథకం క్రింద బత్తుల పల్లిలో రూ.17లక్ష 78వేల 600 వ్యవసాయ పెట్టుబడి చెక్కులు అందజేశారు.

Comments

comments