Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

సెల్‌ఫోన్‌ చిచ్చు.. భార్యపై కత్తితో దాడి!

Husband brutally killed Wife in Mahabubabad district

మహబూబాబాద్‌: దంపతుల మధ్య సెల్‌ఫోన్‌ చిచ్చు పెట్టింది. భార్య వేరే వ్యక్తితో సెల్‌ఫోన్‌ లో రహస్యంగా మాట్లాడుతుందనే అనుమానంతో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ ఘటన గురువారం రాత్రి మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం మల్యాల గ్రామశివారు కంబాలబండ తండాలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే బానోత్‌ సుహాసినిపై భర్త బానోత్‌ నరేందర్‌ అనుమానంతో గత వారం రోజుల నుంచి గొడవ పడుతున్నాడు.  ఈ క్రమంలో ఆమె వద్ద సెల్‌ఫోన్‌ దొరకడంతో వారి మధ్య గొడవ తీవ్ర స్థాియికి చేరింది. దీంతో దంపతుల మధ్య మాట మాట పెరిగి కోపోద్రిక్తుడైన భర్త నరేందర్‌ భార్య సుహాసినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సుహాసిని తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను 108 ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

comments