Search
Monday 21 May 2018
  • :
  • :

పుట్టింటికి వెళ్తానన్నందుకు… భార్యను చంపేశాడు…

Husbend-killed-his-wife

కోటా: పుట్టింటికి వెళ్తానన్నందుకు భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఖేర్కేడా గ్రామంలో చోటుచేసుకుంది. చైన్ సింగ్ (48) అనే వ్యక్తి ఇంట్లో నిద్రపోతున్న తన భార్యపై గొడ్డలితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. నిందితుడి భార్య పుట్టింటికి వెళుతానని భర్తను అడిగింది. అయితే భర్త చైన్ సింగ్ అందుకు అంగీకరించలేదు. దీంతో వారి మధ్య తగువు జరిగింది. తగువు కాస్త ముదరడంతో  తన భార్యను చంపడానికి అతడు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నిద్రపోతున్న భార్యను గొడ్డలితో నరికి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం తో ఘటన స్థలికి చేరుకున్నా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Comments

comments