Search
Monday 21 May 2018
  • :
  • :

న్యాయం జనం వైపా..? ధనం వైపా..?

In the suburban children Marri village of the district

ప్రభుత్వ భూములను ఆక్రమించి అనుభవిస్తున్న వారిపై చర్యలేవి?
జిల్లాలోని పిల్లలమర్రి గ్రామ శివారులోని
సర్వే నంబర్ 175లో 25 ఎకరాల 32 గుంటలు భూమి వివాదం
రెండు రోజుల క్రితమే సర్వే ప్రారంభించిన యంత్రాంగం
ఎటు తేల్చని జిల్లా రెవెన్యూ అధికారులు

భూమి కనపడితే కప్పేయాలనే చందంగా భూ బకాసురులు చూస్తున్నారు. అటువంటి ప్రదేశాలలో రాత్రికి రాత్రే భూములను వశపర్చుకొని అమాయకులకు అంటగడుతున్నారు. ప్రభుత్వ భూమా… లేక ప్రైవేటు భూ మా… అనే సంబంధం లేకుండా భూమి కొనుగోలు చేసే వారిని తమ మాయమాటలతో కప్పిపుచ్చి
చివరికి వారి కంట తడికి కారణమవుతున్నారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భూమి ఖాళీగా ఉంటే కబ్జా చేసే బకాసురులు నేటికి పుట్టగొడుగుల్లా పుట్టకొస్తూనే ఉన్నారు.

మన తెలంగాణ/సూర్యాపేట : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భూమి ఖాళీగా ఉంటే కబ్జా చేసే బకాసురులు నేటికి పుట్టగొడుగుల్లా పుట్టకొస్తూనే ఉన్నారు. భూమి కనపడితే కప్పేయాలనే చందంగా భూ బకాసురులు చూస్తున్నారు. అటువంటి ప్రదేశాలలో రాత్రికి రాత్రే భూములను వశపర్చుకొని అమాయకులకు అంటగడుతున్నారు. ప్రభుత్వ భూమా… లేక ప్రైవేటు భూ మా… అనే సంబంధం లేకుండా భూమి కొనుగోలు చేసే వారిని తమ మాయమాటలతో కప్పిపుచ్చి చివరికి వారి కంట తడికి కారణమవుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా రెవిన్యూ యంత్రాంగం తమ భూములను కూడా కాపాడుకోవడంలో విఫలమవుతూ వస్తూనే ఉంది. ఇటువంటి ఘటనలు ఎన్నో వెల్లువెత్తినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ భూమి ఉందని తెలిసినప్పటికీ ఏళ్ల తరబడి అట్టి భూమిని ఆక్రమించుకోవడంలో యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. అదే మాదిరిగా జిల్లాలోని సూర్యాపేట మండలం పిల్లలమర్రి శివారు ప్రాంతం లో గల సర్వే నంబర్ 175లో గల భూమి కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిపై తర్జనభర్జనలు సాగుతున్నప్పటికీ కొం త మంది వ్యక్తులకు ప్రభుత్వ భూమిపై పట్టాలిచ్చి చేతులు దు లుపుకుంటున్నారనే అపవాదును రెవెన్యూ యంత్రాంగం మూ టకట్టుకుంది. పట్టణంలో అతి త్వరలో విలీనం కాబోతున్న అ శివారు ప్రాంతం కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి నేడు అనర్హుల చేతిలో ఉందని తెలిసినప్పటికీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉదాసీనత వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుంది. పిల్లలమర్రి రెవిన్యూ శివారులోని సర్వే నంబర్ 175లో 25 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవిన్యూ రికార్డులలో నమోదై ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ అ భూమిని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కెక్కిరేణి లింగయ్యకు ఈ సర్వే నంబర్‌లో మొదట 30 గుంటల భూమిని యంత్రాంగం రిజిస్టర్ చేయించింది. క్రమక్రమంగా ప్రభుత్వ భూమిని ఆయన ఆక్రమించుకొని ప్రస్తుతం రెండు ఎకరాల 15 గుంటలకు రెవెన్యూ రికార్డులను సృష్టించి కోట్ల రూపాయల విలువ చేసే భూమిని యథేచ్చగా అనుభవిస్తూ వస్తున్నాడు. ఈ ఆక్రమణపై సమీప లబ్ధిదారులు, రైతులు జిల్లా యంత్రాంగానికి పలుమార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి చలనం కన్పించలేదు. ఇటీవలే కెక్కిరేణి లింగయ్య అ భూమిలో గల కొంత భూమిని సుమారు రూ. 8.50 లక్షలకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వ భూమిపై మంత్రికి నివేదిక అందించడంలో అధికారులు విఫలం….?
సూర్యాపేట జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండి, అన్ని సౌకర్యాలకు అనువుగా ఉన్న ప్రభుత్వ భూమి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర వి ద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి సరైన నివేదిక సమర్పించడంలో రెవిన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. దీనితో అట్టి భూమిని అనర్హులు అనుభవిస్తున్నారని పరిసర ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు.
యంత్రాంగం సర్వే ఇప్పటికైనా

సరికానుందా…?
కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అనర్హుల చేతిలో ఉందని గ్రహించిన అధికారులు గత రెండు రోజుల క్రితం సర్వే నంబర్ 175లో గల 25 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేశారు. జి ల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశానుసారం ఈ భూమిలో ఎంత మంది రైతులు భూమిని కలిగి ఉన్నారో, పట్టాదార్ పాస్‌పుస్తకాలు కలిగి ఉన్నారో…. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అభూమిని ఎక్కువ మంది ఆర్థిక, అండబలం కలిగియు న్న వ్యక్తులే అనుభవిస్తున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి.

ఈ భూమి ఎవరికి దక్కనుంది…?
ప్రభుత్వ నివేదిక ప్రకారం ఉన్న 25 ఎకరాల 32 గుంటల భూమి రెవెన్యూ ఆధీనంలో ఉందని యంత్రాంగం తేలిస్తే ఎటువంటి ఉపయోగానికి భూమిని ప్రభు త్వం కేటాయించనుందోనని పరిసర ప్రాంత రైతులు, స్థానిక ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఇంత ఎక్కువ విస్తీర్ణం అవసరం ఉండనందున డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఏమైనా ఉపయోగించనుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దానికి ఉపయోగించని సమక్షంలో మంత్రి ఆలోచన విధానానికి అనుకూలంగా ఇట్టి భూమిలో జర్నలిస్టులకు డబల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం జరగనుందా అనే పలు సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఎలా ఉన్న పూర్తి నివేదిక అనంతరం మంత్రి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
ప్రభుత్వ భూమిపై అనర్హులకు ఎటువంటి హక్కులు అధికారులు ఇవ్వరాదు : రాపర్తి రవి, సమీప రైతు
కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొన్ని ఎకరాలు కలిగిఉన్న వ్యక్తి లింగయ్య ఒక్కరు మాత్రమే అనుభవిస్తున్నాడు. అ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అధికారులు విన్నవించినప్పటికీ అధికారులు ఎటువంటి సర్వేలు ఇంతకాలం చేయలేదు. గత రెండు రోజుల క్రితం చేశారు. కానీ న్యాయాన్ని ఉన్నతాధికారులే తేల్చాలి. కానీ అనర్హులుగా ఉన్న లింగయ్యకు ఈ భూమిపై ఎటువంటి పాస్‌పుస్తకం, రైతు బం ధు చెక్కు అందజేసినా అధికార యంత్రాంగం విఫలమైనట్లే.

Comments

comments