Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ధాన్యం కొనుగోళ్ల్ల్లలో వేగం పెంచాలి

Increase in grain  purchases
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్

మనతెలంగాణ/పెద్దపల్లి: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని రా ష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, క్లస్టం మిల్లింగ్ రైస్ రికవరీ అంశాలపై అన్ని జిల్లాల సంయుక్త పాలనాధికారులతో గురువారం దూరదృశ్య సమీక్ష నిర్వహి ంచారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాసంగిలో రైతులు పండించిన ధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, చివరి గింజ వరకు ధా న్యం కొనుగోలు చేయడానికి అధికారులు రూపొందిచింన ప్రణాళికను ప్రకడ్బందీగా అమలు చేయాలని తెలుపుతూ,ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు చెల్లించవల్సిన బ కాయిలను వారం రోజుల్లో విడుదల చేస్తామని, నేరుగా రైతుకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. గోడౌన్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.దూరదృశ్య సమీక్షలో పాల్గొన్న జిల్లా సం యుక్త పాలనాధికారి వనజాదేవి మాట్లాగుతూ చివరి గింజ వరకు రైతు వద్ద ధాన్యం మద్దతు ధరపై కొనుగోలు చేయుటకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.జిల్లాలో యాసంగిలో 1 లక్ష 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని అంచన వేయగా ఇప్పటి వరకు 1,38,578 మెట్రిక్ టన్నుల ధాన్యం మద్దతు ధరపై కొనుగోలు చేశామని రూ.176.25కోట్లు చెల్లింపులకు గాను రూ.104.73కోట్లు రైతులకు చెల్లించామని ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 1,41,547 మెట్రిక్ టన్నుల సి ఎంఆర్ రైస్ డిలివరి లక్షం కాగా ఇప్పటి వరకు 8,032 మెట్రిక్ టన్నులు చేశామని, ఆగస్టు15,2018 వరకు లక్షంను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జీ డిఆర్‌డిఒ ప్రేమ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి రెహమాన్,జిల్లా కార్పొరేషన్ సం స్థ మేనేజర్ లక్ష్మినారాయణ, ఎసిఎస్‌ఒ కృష్ణయ్య, డిఎంవో

Comments

comments