Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ఐపిఎల్ ఫైనల్: చెన్నై విజయ లక్ష్యం 179

hyd

ముంబయి: ఐపిఎల్-11లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, చెన్నైకి 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. సారథి కేన్ విలియమ్సన్(47), శిఖర్ ధావన్(26), షకిబ్(23) రాణించారు. చివర్లలో యూసుఫ్ పఠాన్(47), బ్రాత్‌వైట్(21) ఇద్దరు మెరుపు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చెన్నై బౌలర్లలో శార్దుల్, నింగిడి, శర్మ, రవీంద్ర జడేజా, బ్రావో తలో వికెట్ తీశారు.

Comments

comments