Search
Monday 21 May 2018
  • :
  • :

26న ఎస్‌సి, ఎస్‌టి ప్రతిఘటన మహాసభ

sc-st-image

మన తెలంగాణ/సోమాజిగూడ : సుప్రీం కోర్టు తీర్పు దళితులకు వ్యతిరేకంగా ఇవ్వడం సరైంది కాదని, కేంద్ర ప్ర భుత్వ ద్వంద వైఖరికి నిరసనగా ఈ నెల 26న ఎస్సీ, ఎస్టీ ప్రతిఘటన మహాసభను సికింద్రాబాద్‌లోని సిక్‌విలేజ్ హాకీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ సంఘాల జెఎసి ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో మహాసభ పోస్టర్‌ను తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పో రాట సమితి అధ్యక్షులు ఇటుక రాజుతో కలిసి మాల సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభు త్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్ తెస్తామని ప్ర కటించిందని, ఈ ఆర్డినెన్స్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డి మండ్ చేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 143 (ఎ) తీ ర్పుపై దాని పరిణామాల ప్రశ్నలతో కూడిన సలహాలు తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పతికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అట్రాసిటీ చట్టాన్ని 9వ సెడ్యూల్‌లో చే ర్చాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రతిఘటన సభకు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరౌతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు జా తీయ అధ్యక్షులు ఎర్రమల్ల రాములు, టీఎమ్మార్పీయస్ యువత అధ్యక్షులు నల్లశివ మాదిగ, బేడ బుడిగజంగాల హక్కుల దండు అధ్యక్షులు చింతల రాజలింగం, మాల మహానాడు నాయకులు పబ్బతి శ్రీకృష్ణ, నాయకులు గడ్డం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments