Search
Tuesday 19 June 2018
  • :
  • :

దేశవ్యాప్తంగా రైతుబంధును కోరుకుంటున్నారు…

jagadush-reddy

యాదాద్రి భువననగిరి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని దేశంలోని రైతులంతా కోరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో  రైతు బంధు చెక్కుల పంపిణీ, పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొలుపుల అమరేందర్, జిల్లా గ్రథాలయ ఛైర్మన్ జడల అమరేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. రైతు బంధు పథకం దేశంలో విప్లవాత్మకమైన మార్పను తీసుకొచ్చిందన్నారు. రైతులు నుంచి వస్తున్నఆదరణ చూసి కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయన్నారు. ప్రతి గ్రామంలోని రైతు నేడు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చెక్కులు చేతబూని గర్వంగా నేనే తెలంగాణ రైతునని గర్వపడుతున్నాడని మంత్రి చెప్పారు. బ్యాంకుల వద్ద రైతులకు సమస్యలు తలేత్తకుండా బ్యాంకుల్లో సరిపోయేంత డబ్బును సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Comments

comments