Search
Friday 25 May 2018
  • :
  • :

20 నుంచి జనసేన పోరాట యాత్ర

Jan sena Porata Yatra From May 20th

విశాఖపట్నం : విభజనతో ఎపికి జరిగిన అన్యాయంపై జనసేన పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విభజనతో నష్టపోయిన ఎపికి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఎపికి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈనెల 20వ తేదీ నుంచి పోరాటయాత్రను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వేలాది మంది యువత, విద్యార్థులతో ర్యాలీలు తీస్తామని, జిల్లా కేంద్రాల్లో లక్ష మందితో నిరసన కవాతు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Jan sena Porata Yatra From May 20th

Comments

comments