Search
Monday 21 May 2018
  • :
  • :

చంద్రబాబుకు దేవేగౌడ ఫోన్…

DEVE-GOWDA
బెంగళూరు: కర్నాటకలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతును కోరుతూ  మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత దేవేగౌడ ఫోన్ చేశారు. ఈ క్రమంలో కర్నాటకలో నెలకొన్న రాజకీయ పరిణామలను బాబుకు వివరించారు. బిజెపి అప్రజాస్వామ్య రాజకీయాలపై జాతీయ స్థాయిలో నేతలు తమకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించాలా..? వద్దా..?అనే విషయంపై టిడిపి అధిష్ఠానం ఇంకా నిర్ణయించుకోలేదు. మరోపక్క కర్నాటక ఎన్నికల అంశం ప్రస్తుతం జాతీయ స్థాయితో చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో స్పందించడమే సబబని కొందరు మంత్రులు బాబుకు సూచించినట్టు సమాచారం.

Comments

comments