Search
Monday 21 May 2018
  • :
  • :

రాజకీయ పార్టీని ప్రారంభించనున్నజస్టిస్ కర్ణన్…

Jastic-kannan

న్యూఢిల్లీ: కోల్ కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ తమ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ”యాంటీ కరప్షన్ డైనమిక్” పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ పార్టీ తరుఫున కేవలం మహిళలను మాత్రమే బరిలోకి దింపుతామని సూచించారు. దేశంలోని అవినీతి నామరూపాలు లేకుండా చేయాడమే తమ పార్టీ సిద్ధాంతమన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలుస్తామని చెప్పారు. కలకతా హైకోర్టు జడ్జిగా ఉన్న సందర్భంలో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై ఆయనకు 6 నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించడం విదితమే.

Comments

comments