Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

రైతుబంధు పాసుపుస్తకాలపైన కడియం సమీక్ష

Kadiyam Srihari Speech About Ryth Bandhu Checks

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి : రైతుబంధు పాసుపుస్తకాల పంపిణీపై మంగళవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టి. వినయ్‌క్రిష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.  రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 4 వేల రూపాయలు అందిస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుండి రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు జీవితబీమా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కురుర్చుకున్నదని దీనిలో భాగంగా ప్రతి రైతు ప్రీమియం కింద 2,271 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ప్రభుత్వ విఫ్ వెంకటేశ్వర్లు,ఎమ్మేల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దయాకర్‌రావు, రాజయ్య, గిరిజన సహకార సంస్థ చైర్మన్ దరావత్ మోహనగాంధీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులను ప్రశ్నించిన రైతులు
సమీక్ష సమావేశంలో పాల్గొన్న రైతులు అధికారులను, ప్రజాప్రతినిధు లను ప్రశ్నించారు. తమకు ఉన్నభూమి కంటే తక్కువ విస్తీర్ణంతో పట్టాదా రు పాసుబుక్కులలో రావడం ఏంటని ప్రశ్నించారు. సాదాబైనామాలో రెవెన్యూ అధికారులు పట్టామార్పిడి కోసం డబ్బులు వసూలు చేశారని ఆవేధన వ్యక్తం చేశారు. భూప్రక్షాళన సరైనా విధంగా జరుపాలని కోరారు.
తగిన ఏర్పట్లు చేయని అధికారులు
సమీక్ష సమావేశానికి వచ్చిన రైతులకు సరైన ఏర్పాట్లు చేయలేదని రైతులు ఆవేధన వ్యక్తం చేశారు. కూర్చోవడానికి కుర్చీలు, మంచినీరు అందించలేదన్నారు. చాలామంది ఎండలోనే నిలబడి సమీక్షలో పాల్గొన్నారు.

Comments

comments