Search
Friday 25 May 2018
  • :
  • :

అంతే గౌరవం దక్కాలి

Kangana Ranaut talks about her struggles

“సమాజంలో మగాడికి ఎంత గౌరవం ఉందో మహిళలకు కూడా అంతే గౌరవం ఉండాలి. ఇద్దరిలో ఎవరూ తక్కువ, ఎక్కువ కాదు”అని అంటోంది బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నేడు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగింది ఈ బ్యూటీ. “చిన్నప్పుడు మా అమ్మానాన్నలకు రంగోలి, అక్షత్‌లనే ఇద్దరు తోబుట్టువులు జన్మించారు. వారికంటే ముందు ఓ బాబు పుట్టి చనిపోయాడు. దీంతో మా తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఆ తర్వాత నేను పుట్టినప్పుడు మళ్లీ ఆడపిల్లే పుట్టిందని నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒక విధంగా నన్ను వద్దనుకున్నామని ఇంటికి వచ్చే వారితో చెప్పేవారు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది. మహిళ ఎప్పుడూ మగవారి సంతోషమే తన సంతోషంగా భావిస్తుంటుంది. కానీ సమాజంలో మహిళలకు సరైన గౌరవం లేదు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో మగాడికి ఎంత గౌరవం ఉందో మహిళలకు కూడా అంతే గౌరవం దక్కాలి”అని పేర్కొంది.

Comments

comments