Search
Friday 25 May 2018
  • :
  • :

రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న కెసిఆర్ : మహేందర్‌రెడ్డి

Mahender Reddy, KCR Committed for Farmers’ Welfare : Mahender Reddy

వికారాబాద్ : తెలంగాణ సిఎం కెసిఆర్ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. పెద్దెముల్ మండలం తట్టెపల్లిలో గురువారం ఆయన రైతు బంధు పథకం కింద రైతులకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు రూ.5లక్షల ఉచిత బీమా అందిస్తున్న ఘనత కెసిఆర్‌దేనని ఆయన పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్ నారాయణరెడ్డి, ఆర్‌డిఒ వేణుమాధవ్, టిఆర్‌ఎస్ నేత కోహీర్ శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

KCR Committed for Farmers’ Welfare : Mahender Reddy

Comments

comments