Search
Monday 21 May 2018
  • :
  • :

కోల్‌కతా జయకేతనం

kolkata

రాజస్థాన్‌కు షాక్… కోల్‌కతా జయకేతనం

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి ప్లేఆఫ్ అవకాశాలను సజీ వంగా ఉంచుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్‌షోను కనబరిచిన కో ల్‌కతా చిరస్మరణీయ విజయంతో రాజస్థాన్ ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 19 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా మరో రెండు ఓవర్లు మిగిలివుండగానే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నరైన్ రెండు సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో ఏడు బంతుల్లోనే 21 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప మరోసారి నిరాశ పరిచాడు. 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లు కూడా స్టోక్స్‌కు దక్కాయి. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను ఓపెనర్ లిన్, నితీష్ రానా తమపై వేసుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన లిన్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 45 పరుగులు చేశాడు. నితీష్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 21 పరుగులు సాధించాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన దినేష్ కార్తీక్ 31 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రసెల్ రెండు ఫోర్లతో 11 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ప్రారంభంలో బాగానే ఆడింది. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో (27), బట్లర్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో (39) శుభారంభం అందించారు. ఒక దశలో 9 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి పటిష్టస్థితిలో కనిపించిన రాజస్థాన్‌కు కుల్దీప్ యాదవ్ కోలుకోలేని దెబ్బ తీశాడు. అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన కుల్దీప్ 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ప్రసిధ్, రసెల్‌లకు రెండేసి వికెట్లు లభించాయి.

Comments

comments