Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కోల్‌కతా ముందుకు

kolkata

 రాజస్థాన్ ఔట్, ఎలిమినేటర్ పోరు
కోల్‌కతా: ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అ వకాశాలు సజీవంగా నిలిచాయి. బుధవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో కోల్‌కతా 25 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో కోల్‌కతా క్వాలిఫయర్2కు అర్హత సాధించగా, రాజస్థాన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడుతుంది. ఈ మ్యా చ్‌లో గెలిచే జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. చెన్నై సూపర్‌కింగ్స్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు అజింక్య రహానె, రాహుల్ త్రిపాఠిలు శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. కోల్‌కతా బౌల ర్లు కీలక సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేశాడు. త్రిపాఠి రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 20 పరుగుల చేశాడు. అద్భుత పోరా ట పటిమను కనబరిచిన సంజు శాంసన్ 38 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేసినా జట్టును గెలిపించలేక పోయా డు. కీలక సమయంలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యారు. దీంతో ధాటిగా ఆడడంలో విఫలమయ్యారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కోల్‌కతా బౌలర్లు క చ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ జట్టును గెలిపించారు. పియూష్ చావ్లా, కుల్దీ ప్ యాదవ్‌లు అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతాను కెప్టెన్ దినేష్ కాక్తీక్, ఆండి రసెల్ ఆదుకున్నారు. ధాటిగా ఆడిన కార్తీక్ రెండు సిక్స్‌లు, 4 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. చెలరేగి ఆ డిన రసెల్ ఐదు సిక్సర్లు, మరో మూడు ఫోర్ల తో 25 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు.

Comments

comments