Search
Monday 21 May 2018
  • :
  • :

కెసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

kondapur Sarpanch Speech About CM KCR

చేగుంట: చేగుంట మండల పరిధిలోని బోనాల కొండాపూర్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి  పాలతో అభిషేకం చేసారు. గురువారం రోజు గ్రామంలో రైతు బంధు చెక్కులు పంపిణి కార్యక్రమం జరుగుతుండగా గ్రామ సర్పంచ్ ప్రవీణ రాజిరెడ్డి కెసిఆర్ చిత్రపటంకు పాల తో అభిషేకం చేసిన అనంతరం రైతులకు,కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈసందర్భంగా ఆమే మాట్లాడుతూ రైతుల బాధలు తెలిసిన ముఖ్యమంత్రి తెలంగాణలో రైతుల కొసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని 24 గంటల విద్యుత్, సప్సిడీలతో విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, ట్రాక్టర్లు, రైతుకు గిట్టుబాటు ధరతో పాటు రైతు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుండి రైతు పంట పండించడానికి లాగడి కోసం ఎకరాకు 4 వేల చొప్పున డబ్బులు ఇస్తున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, బూర్గుశ్రీను,గూటం చంద్రం,మహిళా రైతులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comments

comments