Search
Monday 21 May 2018
  • :
  • :

ముసలమ్మ ఇంటికి రైతుబంధు కెటిఆర్

KTR Distributes Rythu Bandhu Cheques

మన తెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో జక్కుల మాణిక్యమ్మ (80) అనే వృద్ధురాలికి ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో కలిసి వెళ్లి రైతు బంధు చెక్కును అందించారు.రైతుబంధు పథకంలో చెక్కులు అందుకోలేని వికలాంగులు, వృద్ధ్దుల ఇండ్లల్లోకి అధికారులే వెళ్లి చెక్కులను అందజేస్తున్న నేపథ్యంలో ఎనభై యేళ్ల వృద్ధ్దురాలు జక్కుల మాణిక్యమ్మ కదల్లేని స్థితిలో ఉండడంతో మంత్రి కెటిఆర్ స్వయంగా మాణిక్యమ్మకు వచ్చిన 5400 రూపాయల చెక్కును తీసుకెళ్లి ఆమెకు అందజేశారు. అనంతరం ఆమెతో మాట్లాడి ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. రా జన్న సిరిసిల్ల జిల్లాలో రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత అధికారులు అనేక మంది ఇండ్ల ల్లోకి వెళ్లి చెక్కులు అందించినప్పటికీ మొట్టమొదటి సారిగా మంత్రి కెటిఆర్ గూడెంలో వృద్దురాలి ఇంటికి స్వయంగా వెళ్లి చెక్కు అందించడం విశేషం.

Comments

comments