Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఆగని పైపులైన్ లీకేజీలు

 Leakages in Mission Bhagiradha Pipeline

మనతెలంగాణ/ సదాశివనగర్ : మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో రోజురోజుకు లీకేజిలు కనిపిస్తున్నాయి. పైప్‌లైన్ పనులను పరిశీలిస్తున్న సమయంలో లీకేజిలు బయటపడుతున్నాయి. ఒకచోట మరమ్మత్తులు పూ ర్తి చేయగానే మరోచోట లీకేజి బయటపడుతుంది. దీంతో పైప్‌లైన్ ప నులు చేస్తున్న సిబ్బందికి పనులపై అవగాహన లేకపోవడం లేదా, నాసిరకం పనులు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. సదాశివనగర్ మ ండలంలోని పద్మాజివాడి చౌరస్తాలో గత మూడు రోజుల క్రితం అంతర్గత పైప్‌లైన్ లీకేజి అయింది. దీని వల్ల నీరు అనేకం వృధాగా పోయింది. మరుసటిరోజు ఇక్కడ పైప్‌లైన్ మరమ్మత్తులు చేసారు. మళ్లీ శుక్రవారం అదే చోట నుండి నీరు లీకేజి అయి నీరు వృధాపోతుంది.

Comments

comments