Search
Friday 25 May 2018
  • :
  • :

రైతన్నను ఆదుకునేందుకే ‘ రైతుబంధు’

Minister KTR Comments on Rythu Bandhu

రాజన్న సిరిసిల్ల : రైతన్నను ఆదుకునేందుకే సిఎం కెసిఆర్ రైతుబంధు పథకం అమలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కెటిఆర్ తెలిపారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో గురువారం కెటిఆర్ రైతులకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు బంధు చెక్కుల పంపిణీతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. గత పాలకులు రైతన్నను కనీసం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చి, కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే దేశం బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. రైతన్నలను అన్ని విధాల ఆదుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి బాల్క సుమన్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Minister KTR Comments on Rythu Bandhu

Comments

comments