Search
Tuesday 19 June 2018
  • :
  • :

రైతు సంక్షేమమే ధ్యేయం

Minster Jagadeesh Reddy Speech About Farmers

మనతెలంగాణ/వలిగొండ: రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబ సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్షమని రాష్ట్ర విద్యుత్ శాఖ ఎస్సీ ఉపకులాల అభివృద్ధ్ది శాఖ మంత్రి గుంతకండ్ల జగదీ శ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పులిగిల్ల గ్రా మం లో రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు ముందస్తు పెట్టు బడి సహాయం, నూతన పట్టాదార్ పాస్‌పుస్తకాలను అందజే శారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 60 సంవత్సరాల కాలంలో రైతుల వంక చూడ లేదని ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు బాంధవుడని, వ్యవ సాయం చేసే రైతుల కన్నీటి బాధలను చూసిన రైతుల అభివృద్ధ్ది కోసం 24 గంటల ఉచిత విద్యుత్, రైతులు పెట్టు బడి కోసమని వ్యాపారస్తుల వద్ద అప్పు చేయకూడదని, ప్రభు త్వమే అధికా రులతో వ్యవసాయ పెట్టుబడి కో సం ఎకరానికి 4వేల రూపాయ ల చెక్కులను అందిస్తున్నామ న్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల ముందు కల్ల బొల్లి మాటలు చెప్పి ఎన్నికల అనంతరం ప్రజల యోగ క్షే మాలను పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కల ముందు చెప్పి న వాగ్దా నాలే కాకుండా మ్యానిఫెస్టో లో పొందు పరచని రైతుబంధు పథకం, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్,కేసిఆర్ కిట్, విద్యార్థులకు సన్న బియ్యం పథకం, గర్భిణీ స్త్రీలకు 12 వేల రూపాయల తోపాటుగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మనసున్న మన ముఖ్య మంత్రి కేసిఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ జేసి రవినాయక్,డిసిపి రాం చంద్రారెడ్డి, చౌటుప్పల్ ఆర్‌డిఒ సూరజ్ కుమార్,ఏసిపి రమేష్,జిల్లా రైతు సమన్వయ కమిటి కన్వీనర్ కొల్పుల అమరేందర్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా.అమరేందర్ గౌడ్,స్థానిక ఎంపిపి శ్రీరాముల నాగరాజు, జెడ్పీటీసీ మొగుళ్ళ శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ కొలను మహెందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

comments