Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

గొంతుకోసి సెల్‌ఫోన్ చోరీ..!

Mobile Theft after Cut the Throat in Peddapalli district

పెద్దపల్లి: ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి మొబైల్ అపహరించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న కార్మికుడిపై దుండగులు కత్తితో గొంతుకోసి సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే మంథని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. బాధితుడిని ఒరిస్సాకు చెందిన జీలేశ్వర్ రవిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments