Search
Monday 21 May 2018
  • :
  • :

వాయిదా పడిన ‘ ఆఫీసర్ ’

Nag’s Officer Postponed to June 1st

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, హీరో అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో తీసిన ‘ ఆఫీసర్ ’ సినిమా విడుదల వాయిదా పడింది. 25 ఏళ్ల తరువాత వర్మ, నాగ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ ఆఫీసర్ ’ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 25న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదలను జూన్ 1కి వాయిదా వేసినట్టు దర్శకుడు వర్మ తెలిపారు. ఈ సినిమాకు సాంకేతిక హంగులు జోడించేందుకు మరింత సమయం పడుతుందని, ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలను జూన్1కి వాయిదా వేసినట్టు వర్మ వెల్లడించారు. ముంబయి మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మైరా సరీన్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

Nag’s Officer Postponed to June 1st

Comments

comments