Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

రాహుల్ గాంధీ ఆశయాలను సాధిస్తాం

Motive behind Rahul Gandhi's historical

మనతెలంగాణ/మహబూబాబాద్ టౌన్ : భారత దేశ యువనేత, ఎఐసిసి జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆశయాలను సాధిస్తాం అని రాహుల్ గాంధీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సం దర్భంగా రాహుల్ గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక ఐఎంఎ భవనంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదానం సుమారు 100 మంది యువకులు పా ల్గొన్ని స్వచ్ఛంగా రక్తం దానం చేశారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలవేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలని పిలుపు నిచ్చా రు. రాబోయే ఎన్నికలో భారత దేశ ప్రధాని రాహుల్ గాంధేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వ్యక్తులను ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరు రక్తాన్ని దానం చేయాలని సూచించారు. సేవా భావాలు అలవాటు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు. అనంతర ం జడ్పిఫ్టోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్న, పట్టణ అధ్యక్షులు ముల్లంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రక్తధాన శిబిరం నిర్వహించడం అభనందనీయమని హుస్సేన్ నాయక్‌ను కొనియాడారు. రాహుల్ గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏ కార్యాక్రమాలు చేసినా ముం దుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి వరప్రసాద్, ఉపాధ్యక్షుటు డాక్టర్ నెహ్రునాయక్, డైరెక్టర్స్ డాక్టర్ జ్యోతెంద్రనాధ్, కొర్ర వెంకన్న, కాంగ్రెస్ నాయకులు బానోత్ ప్రసాద్, వెన్నం లకా్ష్మరెడ్డి, గుగులోత్ వెంక ట్, కంకల బీరయ్య, తిపర్తి శ్రీదర్, చెన్నూరి విజయలక్ష్మి రాహుల్ గాంధీ సేవా సమితి నాయకులు కిరణ్, రంజిత్ మూలగుండ్ల వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments