Search
Friday 25 May 2018
  • :
  • :

అమెరికాతో చర్చలు రద్దు: ఉత్తర కొరియా

Negotiations with America: North Korea

సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జూన్ 12న జరుగనున్న సమావేశాన్ని రద్దు చేస్తామని ఉత్తర కొరియా ప్రకటించింది. ఏకపక్షంగా అణు ఆయుధాగారాన్ని ఉత్తర కొరియాతో ధ్వంసం చేయించాలని  అమెరికా ఆశిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా, దక్షిణ కొరియా చేపట్టిన మాక్స్ థండర్ జాయింట్ మిలటరీ విన్యాసాలను దుర్మార్గమైన, రెచ్చగొట్టే చర్యలని నిందించింది. గతంలో ఉత్తర కొరియా అణు కార్యకలాపాలకు స్వస్తి పలుకుతామని ముందుకు వచ్చింది. అయితే అమెరికా, దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలతో తన వైఖరిని మార్చుకుంది. ఉత్తర కొరియాను పూర్తిగా అణ్వస్త్ర రహిత దేశంగా మార్చి లిబియాలో మాదిరిగా నాసా సాయంతో అధ్యక్షుడిని చంపిన విధంగానే, ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుసేన్‌ని హత్య చేసిన తీరులోనే  ఉత్తర కొరియాలో తమ కుట్రని అమలు చేయడానికి పూనుకుంటున్నారని..అందుకు వాషింగ్టన్ చర్యలు అద్దం పడుతున్నాయని ఉత్తర కొరియా అనుమానం వ్యక్తం చేసింది. తాము అణ్వస్త్ర కార్యకలాపాలను ఆపమని, తమ దేశాన్ని అమెరికా ఆక్రమించకుండా వుండటానికి, తమ దేశ రక్షణకు అణ్వాయుధాలు అవసరమని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. దీంతో మే 12న అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సింగపూర్‌లో జరగాల్సిన ఇరుదేశాల సమావేశం ప్రశ్నార్థకంలో పడింది.

Comments

comments