Search
Monday 21 May 2018
  • :
  • :

మురికి నీటిగుంతలో పడి ఒకరి మృతి

One dead in a dirty hole

ఉట్నూర్‌: మండల కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన యాసమనేని గోపాల్(43) మురికి నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఎస్సై సంతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం… గోపాల్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. గత 17 ఏళ్ళ క్రితం వివాహం అయింది. విడాకులు కూడా జరిగాయన్నారు. గత కొన్ని ఏళ్ళుగా మధ్యానికి బానిసయ్యాడని తెలిపారు. బుధవారం రాత్రి సైతం మధ్యం సేవించి ఇంటికి వెళ్తుండగా సినిమా ధియేటర్ సమీపంలో గల మార్గం పక్కన వర్షపు నీరు చేరి మురికి గుంత ఏర్పడింది. అందులో గోపాల్ పడిపోవడంతో శ్వాస ఆడక మృత్యువాత పడ్డాడు. మృతడి తమ్ముడు కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Comments

comments