Search
Monday 21 May 2018
  • :
  • :

పాపికొండల ప్రయాణమా జర భధ్రం

Papikondal tourism is a favorite of all

భద్రతపై గ్యారెంటీ ఎంత?
రాత్రి విడిదిలో జాగ్రత్తలు ఏవి?
అపశృతి దొర్లితే బాధ్యులు ఎవరు?
ప్రస్తుతం నిలిపేసిన పర్యాటక ప్రయాణం
ఇక నుండి పోర్టు అథారిటీకి సర్వాధికారాలు

మన తెలంగాణ/భద్రాచలం : ఉల్లాసాన్ని, ఆనందాన్ని, మధుర స్మృతులను మిగిల్చే పాపికొండల పర్యాటక యాత్రంటే అందరికీ ఇష్టమే. వేలాది మందికి విహార ఆనందాన్ని మిగిల్చే ఈ యాత్రలో భద్రత ఎంతా అనే ప్రశ్న ఇప్పుడు అందర్నీ తొలుస్తోంది. ఈ నెల 11వ తేదిన తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలో ఓడపల్లి గోదావరి నదిలో లాంచీలో మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులకు గాయాలు కావడం, అదే విధంగా ఈనెల 15వ తేదిన తూ.గో జిల్లాలోని దేవిపట్నం మండలం పరిధిలోని మాటూరు – ఓడపల్లి గోదావరి నదిలో ప్రయాణికులతో వెళుతున్న లాంచీ ఒక్క సారిగా నీటిలో మునిగిపోయి సుమారు 22 మంది జల సమాధి అయ్యారు. అదే విధంగా గత ఏడాది డిసెంబర్ మాసంలో విజయవాడ కృష్ణ నదిలో పడవ మునిగిపోయి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాధ ఘటనతో పాపికొండల పడవ ప్రయాణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనుభవజ్ఞులంతా పాపికొండల ప్రయాణమా జర భద్రం అంటూ సూచనలు చేస్తున్నారు.

భద్రతపై గ్యారెండీ ఎంతా ? : పాపికొండల విహారయాత్రకు వెళ్లాలంటే భద్రాచలం నుండి సుమారు 70 కి.మీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సుమారు 35 బోట్లు శ్రీరామగిరి, పోచారం నుండి పాపికొండలకు తిరుగుతుంటాయి. అదే విధంగా రాజమండ్రి నుండి కూడా పాపికొండల విహారయాత్రకు తిరిగేలాంచీలు 35 నుండి 40 వరకు ఉన్నాయి. ఒక్కొక్కదాని కెపాసిటిని బట్టీ 45 నుండి 140 వరకు యాత్రికులు ఎక్కే అవకాశం ఉంది. కానీ కొన్ని సమయాల్లో నిర్వాహుకులు లెక్కలు మించి పర్యాటకులను ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మాటూరు-ఓడపల్లి, విజయవాడ తరహా సంఘటన చోటు చేసుకుంటే అత్యంత లోతుగా ఉండే పాపికొండల గోదావరిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయట పేడ అవకాశం లేదు. బోటులో ఒక్కరికి మించి గజీతగాళ్లు ఉండటం లేదు మొన్నటి మాదిరిగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎంతమందిని రక్షించ గలరో అంటూ పర్యాటకులు పెదవి విరుస్తున్నారు. రక్షణ చర్యలు లేకపోవడటం వల్లే మొన్నటి ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే రాత్రి వేళల్లో ఆ ప్రాంతాల్లో ఎలాంటి భద్రత లేదు. పూర్తి అటవీప్రాంతం, గోదావరి తీరం, సుమారు 50 కి.మీ పైనే నీటిలో వస్తేనే గానీ రహదారి సౌకర్యం ఉండదు. ఇలాంటి పరిస్థితి మహిళల రక్షణపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. హార్టేటాక్ వంటి పెద్ద పెద్ద రుగ్మతలు అలుముకుంటే వైద్యం కోసం వచ్చే లోపు ఉంటారోపోతారో కూడా గ్యారెంటీ లేదు. గత కొంత కాలం క్రింత ఓ ప్రైవేటు వైద్యులు ఇలాంటి సమస్యనే ఎదుర్కుని తృటిలో ప్రాణాపాయ స్థితి నుండి బయపడ్డారు. అదే విధంగా ఓ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ప్రజల ప్రాణాలతో చెలగాటం :- నిండు గోదావరిలో అత్యం ప్రమాదర ప్రయాణం లాంచీ ప్రయాణం. అయినప్పటికీ నిర్వాహకులు తమ ఆదాయం కోసం నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిమితికి మంచి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ప్రమాణాలు పాటించకుండా గోదావరిలో ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ప్రతీ పది మంది ప్రయాణికులకు ఒక గజీతగాడు ఉండాల్సి ఉంది. కానీ ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. లైఫ్ జాకెట్లు ప్రయాణికుల లెక్కకు తక్కువగా ఉంటున్నాయి. అది కూడా తక్కువ బరువు ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడేవి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. లాంచీని నడిపే డ్రైవర్ తో పాటు సరంగ్, వారికి సహాయకులుగా ఉండే వారి ఫిట్‌నెస్ ఉందో లేదో కూడా తెలీదు. బాగా వయస్సు మళ్లిన వారిని కూడా నిర్వాహకులు పనిలో పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క గోదావరిలో తిరిగే బోట్ల ఫిట్‌నెస్ పై కూడా పలు అనుమానాలే ఉన్నాయి.

ప్రస్తుతం నిలిచిన పాపికొండల పర్యాటకం :- మాటూరు-ఓడపల్లి ఘటనతో తూర్పు గోదావరి జిల్లాలోని విఆర్ పురం మండల నుండి, అటు రాజమండ్రి నుండి తిరిగే పాపికొండల లాంచీలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. తిరిగి అనుమతులు ఇచ్చేంత వరకు గోదావరి నదిలో లాంచీలు కనిపించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అంతే కాకుండా లాంచీలు వంటలు చేయరాదనే నిబంధనలను సైతం పెట్టారు.

పోర్టు అథారిటీ చేతికి పర్యాటక లాంచీలు :- పాపికొండల పర్యాటకాన్ని అక్కడి ప్రభుత్వం పోర్టు అథారిటీకి అప్పగించింది. ఇక నుండి పాపికొండల ప్రయాణం అంతా పోర్టు అథారిటీ ద్వారానే సాగనుంది. ఇప్పటికే దవళేశ్వరం వద్ద విఆర్ పురం, రాజమండ్రి ప్రాంతాల లాంచీల నిర్వాహకులు, సంబంధిత అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇందు కోసం త్రిసభ్య కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. త్వరలో ఆఫీసర్లు, లాంచీల నిర్వాహకులు, డ్రైవర్లు, సరంగ్‌లతో కలిసి మరో మీటిం గ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాంచీని నడిపే వారికి పూర్తి ఆర్యోగ పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్‌గా ఉంటే తప్ప లాంచీని నడిపేందుకు అనుమతులు ఇవ్వరు. ప్రస్తుతం లాంచీ అడుగు భాగంలో ఉండే అరను మార్చేచి దానినే నాలుగు అరలుగా మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏదైన కొండకు గాని, చెట్ల మొట్లకు గాను లాంచీ తిగిలి ఆప్రాంతంలో బొక్క పడితే, దెబ్బతదిలిన ప్రాంతంలో ఉన్న అర లోనికి మాత్రమే నీరువస్తాయని, వాటిని సునాయాసంగా బయటకు పంపేయవచ్చని సూచించినట్లు సమాచారం.

Comments

comments