Search
Monday 21 May 2018
  • :
  • :

నా గుండె బరువెక్కింది : పవన్ కల్యాణ్‌

Janasena Party President Pawan Kalyan Calls Boycott Yellow Mediea

అమరావతి: గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటన తెలియగానే తన గుండె బరువెక్కిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రోజువారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం ఆందోళన కలిగించిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 60అడుగుల లోతున లాంచీ పడిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం అయ్యిందన్నారు. మృతుల కుటుంబాలకి 25 లక్షల చొప్పున పరిహారం  ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు.

Comments

comments