Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ప్రజల వద్దకే ఎస్‌సి, ఎస్‌టి కమీషన్

Police should be aware of the laws

పోలీసులు చట్టాలపై అవగాహన కల్గిఉండాలి
అధికారులు నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవు
ప్రతినెలా ఓ గ్రామంలో ప్రజా హక్కుల దినం నిర్వహించాలి : ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్

మన తెలంగాణ/ సంగారెడ్డి టౌన్ : ప్రజల వద్దకే ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ వస్తుందని, ప్రతి నెల 31వ తేదీన ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ప్రజా హ క్కుల దినోత్సవాన్ని విధిగా నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నా రు. బుధవారం సంగారెడ్డి మండల పరిధిలోని తాళ్లప ల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా హక్కుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జడ్‌పిహాల్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ప్రజల వద్దకే ఎస్‌సి, ఎస్‌టి కమీషన్ మాట్లాడుతూ గత ఉమ్మడి రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి దాని హక్కులను విధులను ప్రజలకు తెలియకుండా చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 2018లో సిఎం కేసీఆర్ తనను ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్‌గా నిర్వహించినప్పటి నుండి అనేక సంస్కరణలు తీసుకొచ్చానన్నారు. వ్యయ ప్రయాసాల గురించి ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న కా ర్యాలయానికి తిరగాల్సిన అవసరం లేదని , ప్రతి నెల మండలంలోని ఏదో ఒక గ్రామంలో ప్రజా హక్కుల దినాన్ని అధికారులు విధిగా నిర్వ హించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతి మూడు నెలలకు ఒక సారి జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించాలన్నారు. పోలీసు అధికారులకు చట్టాలపై అవగాహన ఉండేలా చూడాలంటూ రాష్ట్ర డీజీపీకి ఇప్పటికే ఒక లెటర్‌ను పంపినట్లు తెలిపారు. కమీషన్ బాధ్యతలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చూడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి శ్రీధర్, తహాశీల్దార్ విజయ్‌కుమార్, ఎంపిడీవో జయలక్ష్మీ, ఎస్‌ఐ, గిరిజన సంఘం నాయకులు రాజేందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments