Search
Friday 25 May 2018
  • :
  • :

పంజాబ్ టార్గెట్ 187

polard

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు, పంజాబ్‌కు 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగుల సాధించింది. పోలార్డ్(50), సూర్యకుమార్ యాదవ్(27), ఇషాన్ కిషన్(20), కృనాల్ పాండ్యా(32) రాణించారు. పంజాబ్ బౌలర్లలో టై 4 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్ 2 వికెట్లు తీయగా, అంకిత్, స్టోయినీస్ తలో వికెట్ పడగొట్టారు.

Comments

comments