Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

సన్‌రైజర్స్ తడ‘బ్యాటు’… చెన్నై లక్ష్యం 140

HYD

ముంబయి: ఐపిఎల్-11లో భాగంగా వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు, చెన్నైకి 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే గట్టి ఎదరు దెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(0) చాహర్ బౌలింగ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్(24) మరో ఓపెనర్ గోస్వామి(12)తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ, చెన్నై బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. యూసుఫ్ పఠాన్(24), షకిబ్(12), మనీష్ పాండే(8) అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. చివర్లలో బ్రాత్‌వైట్(43) చెలరేగి ఆడడంతో సన్‌రైజర్స్ జట్టుకు గౌరవప్రద స్కోరు దక్కింది. దీంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో వికెట్లు తీయగా, ఠాకూర్, ఎంగిడి, జడేజా, చాహర్‌లు తలో వికెట్ పడగొట్టారు.

Comments

comments