Search
Friday 25 May 2018
  • :
  • :

త్వరితగతిన పనులు పూర్తి చేయాలి

Quick tasks must be completed

మన తెలంగాణ/కరీంనగర్ టౌన్: నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. గురువారం నగరంలోని 14 వ డివిజన్‌లో జరుగుతున్న  అభివృద్ది పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. నగరంలోని ప్రతి గల్లీలో సిసిరోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. నగరంలో నీటి సమస్య లేకుండా కూడ చర్యలు తీసుకుంటున్నమని అన్నారు. అందరి సహకారంతోనే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.  నగరానికి నిధుల కొరత లేదని అన్నారు. ఎన్ని నిధులైన ప్రభుత్వం ఇచ్చేందకు సిద్దంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments