Search
Monday 21 May 2018
  • :
  • :

పాలమూరు జిల్లాలో భారీ వర్షం…

rain

మహబూబ్ నగర్: జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, భూత్పూరు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, మెరుపులతో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 45 నిమిషాల పాటు వర్షం పడింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. రైతన్నలు పండించిన ధాన్యం తడవకుండా కవర్లు కప్పి జాగ్రత్త పడ్డారు. రాత్రి 7 గంటల వరకు పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. భూత్పూరు మండలం మద్దిగట్టలో కోడె దూడ, వెల్కికర్లలో రెండు ఆవులు, రాజపూర్ మండలం కుచ్చరకల్ లో రెండు కాడెద్దులు, బాల్ నగర్ మండలం చిన్న రేవల్లిలో రెండు కాడెద్దులు, నవాజ్ పేట మండలం మరికల్ లో ఒక ఎద్దు పిడుగు పాటుకు గురై మృత్యువాత పడ్డాయి.

 Death

Comments

comments