Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

మనసున్న మహారాజు…

Rashid Khan Dedicates Man of the Match Award to Afghanistan Blast Victims

హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతోంది. ఐపిఎల్ లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో  రషీద్ క్రికెట్ అభిమానులను కట్టిపడేశాడు. శుక్రవారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్-2 మ్యాచ్‌లో రషీద్ చేసిన అద్భుత ప్రదర్శనపై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది. సోష‌ల్ మీడియా ద్వారా ర‌షీద్‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. తన ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఒంటిచేత్తో ఎస్ఆర్ హెచ్ కు అద్భుత విజయాన్ని అందించాడు.

బ్యాటింగ్ లో 10 బంతుల్లోనే 34 పరుగులు చేసిన రషీద్ బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి 19 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫీల్డింగ్ లో రెండు అద్భుతమైన క్యాచ్ లు పట్టాడు. దీంతో రషీద్ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. మ్యాచ్‌ అనంతరం రషీద్ ఖాన్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. తనకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా వచ్చిన రూ. 5 లక్షల మొత్తాన్ని, గతవారం ఆఫ్ఘనిస్థాన్ లో జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకుముందు కూడా రషీద్ ఇదే సీజన్ లో ముంబయి ఇండియన్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో వచ్చిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను ఆస్పత్రిలో ఉన్న మిత్రుడి కుమారుడికి రషీద్‌ విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Comments

comments