Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

బిసి విద్యార్థులందరికి రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి

 Reimbursement must be given to all BC students

మన తెలంగాణ/మోత్కూరు : ర్యాంకులతో సంబంధం లేకుండా బిసి విద్యా ర్థ్దులందరికీ ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌ను వర్తింపజే యాలని బిసి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆది వారం మోత్కూరు మండల బిసి రిజర్వేషన్ సాధన సమితి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 10వేల లోపు ర్యాం కు ఉన్నవారికే ఫీజు రీయింబర్స్ మెంట్ నిబంధ నలను తొలగించా లని,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ విద్యా ర్థులకు ఇస్తున్న విధం గానే  ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న బిసి విద్యా ర్థ్దులం దరికి పూర్తి ఫీజు రీయిం బర్స్‌మెంట్ ఇవ్వాల న్నారు. తెలంగాణ రాష్ట్రంల ఏర్పడిన నాలుగేళ్ళలో  ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో రాకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాంకులతో సంబంధం లేకుండా బిసి విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు గుండు శ్రీను, గొలుసుల కొండయ్య, నల్ల మాస లింగయ్య, వారా ల శోభన్‌బాబు, ఏ.రవి,కృష్ణ,నాగ రాజు, అజయ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments