Search
Tuesday 19 June 2018
  • :
  • :

గుడ్డుతో గుండెజబ్బులకు చెక్

egg

రోజూ కోడిగుడ్డును తినడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ప్రతి రోజూ గుడ్డును తినడం వల్ల 26 శాతం మంది గుండెపోటును తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. గుడ్డు తినని వారికంటే తినేవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువంటున్నారు. కార్డియోవాస్యులర్ (సివిడి) అనే జబ్బు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతోంది. దీనివల్ల చాలా మటుకు ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. చైనాలో ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చైనాలో ఓ సర్వే చేపట్టినట్లు జర్నల్ హార్ట్లో ప్రచురించింది.  ఇస్కీమిక్ హృదయ వ్యాధి, స్ట్రోక్ కారణంగా చాలామంది మరణిస్తున్నట్లు తెలిపింది. చాలా పాశ్చాత్య దేశాల్లో అకాల మరణం సంభవించడానికి కారణం ఇస్కీమిక్ గుండె వ్యాధి అని నిర్ధారించారు.  గుడ్డులో అధికంగా ఉండే ప్రొటీన్లు, విటిమిన్లు, కెరోటినాయిడ్స్ వంటివి వుండటం వల్ల గుండెజబ్బులకు చెక్ పెడతాయని చైనా, యుకెలోని పరిశోధకుల బృందం ప్రొఫెసర్ లిమ్గ్ లి , డాక్టర్ కాకిక్గ్ లు వెల్లడించారు.  చైనాలోని 10 విభిన్న భౌగోళిక ప్రాంతాల నుంచి 30 నుంచి 79 ఏళ్ల వయసులో ఉన్న సుమారు 5లక్షల మందిపై చైనా కదోరి బయోబ్యాంక్ అధ్యయనం  చేపట్టింది.  ఇందుకోసం క్యాన్సర్, సివిడి, డయాబెటిస్ లేని 4,16,213 మంది గుడ్డు తిననివారిపై సర్వే చేపట్టింది. 8,9 ఏళ్ల తర్వాత తిరిగి వారిని పరిశీలించగా, వారిలో కొన్ని కేసులు సివిడి, కొన్ని ఆకస్మిక మరణాలు సంభవించినట్లు అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

Comments

comments