Search
Monday 21 May 2018
  • :
  • :

అసంపూర్తిగా వక్ఫ్ భూముల సర్వే

Revenue Survey has identified 836 assets as Waqf propertie

మన తెలంగాణ / హైదరాబాద్ : వక్ఫ్ భూముల సర్వే అసంపూర్తిగా ముగిసింది. వివాదాస్పద భూముల పరిష్కారం కాగితాలకే పరిమితమయ్యింది. అన్యాక్రాంతమైన భూముల స్వాధీనం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. ఇంకా వేల కోట్ల ఆస్తుల వివరాలు వక్ఫ్‌బోర్డుకు అందడంలేదు. చట్టబద్ద అధికారాలు లేకపోవడంతో వక్ఫ్‌బోర్డు నిస్సహాయంగా మారింది. పూ ర్తిగా రెవెన్యూ అధికార యంత్రాంగంపైనే ఆధారపడాల్సి న పరిస్థితిలో వివాదంలో ఉన్న వక్ఫ్‌భూములకు పరిష్కారం ఆలస్యమవుతోంది. రెవెన్యూ అధికార యంత్రాం గం ‘రైతుబంధు’ కార్యక్రమాల్లో తలమునకలై ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక వక్ఫ్ భూముల రెండో విడుత సర్వేలు, వివాదాల పరిష్కారం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదని అధికారులే అభిప్రాయపడుతున్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సంఘాలు సై తం ఆందోళన చెందుతున్నాయి. వేల కోట్ల విలువైన ఆస్తులున్నా వాటిని సద్వినియోగం చేసుకునే స్థితిలో వక్ఫ్‌బోర్డు లేదని విమర్శిస్తున్నాయి. మొత్తానికి వక్ఫ్ సర్వే అసంపూర్తిగా ముగియడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల రెవెన్యూ అధికారులు చేపట్టిన భూ సర్వేలో వక్ఫ్‌బోర్డు నోటిఫై చేయని ఆస్తులు కూడా వెలుగులోకి వచ్చాయి.

కొత్తగా 818 ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా రెవెన్యూ సర్వే తేల్చింది. వీటికి సంబంధించిన వివరాలేవి వక్ఫ్‌బోర్డులో లేకపోవడంపై మైనారిటీ సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో కూడా తెలియని స్థితిలో తెలంగాణ వక్ఫ్‌బోర్దు ఉందని ‘సేవ్ వక్ఫ్ ప్రాపర్టీస్ అసోసియేషన్’ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇఫ్తెఖార్ హుస్సేన్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33,929 వక్ఫ్ సంస్థలు ఉంటే వాటి ఆధ్వర్యంలో 77,560 ఎకరాల వ్య వసాయ భూములున్నాయని, కానీ గెజిట్‌లో 32,596 ఎ కరాల ఆస్తులు మాత్రమే నోటిఫై అయ్యాయని, మిగతా 1,333 ఆస్తులకు సంబంధించిన వివరాలు వక్ఫ్‌బోర్డు అందించాల్సి ఉందని పేర్కొన్నారు. వాటి వివరాలు అందిన వెంటనే రెవెన్యూ శాఖ అప్‌డేట్ చేయనుంది. 23 వేల వక్ఫ్ సంస్థలు, వాటికి సంబంధించిన 53 వేల ఎకరాల భూములు రెవెన్యూ సర్వేలో మాత్రంగుర్తించారు. సుమారు 11 వందల వక్ఫ్ ఆస్తులు, వాటికి సంబంధించిన దాదాపు 23 వేల ఎకరాల భూములు వివాదాల్లో ఉండడంతో వాటిని రెవిన్యూ అధికారులు తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటిపై ఉన్న వివాదాలకు పరిష్కారం లభించిన వెంటనే వాటిని కూడా అప్‌డేట్ చేయడం జరుగుతుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. వక్ఫ్ బోర్డుకు చట్టబద్ద అధికారాలు లేకపోవడం, బోర్లులో పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడం లాంటి అనేక కారణాల వల్ల భూ వివాదాల పరిష్కారం కాగితాలకే పరిమి తం అయ్యింది.  వక్ఫ్ భూముల్లో దాదాపు 80 శాతం ఆ క్రమణల్లో ఉన్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. రె వెన్యూ సర్వేలో గుర్తించిన 818 వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన భూములు వివరాలు కూడా ఇప్పటికీ తేలలేదు.

Comments

comments